mahesh: మహేశ్ ఆడియో వేడుకకు ఎన్టీఆర్ .. చరణ్?

షార్ట్స్‌లో చూడండి
మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'భరత్ అనే నేను' ఆడియో వేడుకను ఏప్రిల్ 7వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీస్థాయిలో జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఎన్టీఆర్ ను .. చరణ్ ను మహేశ్ ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది.

ఇక ఎన్టీఆర్ .. చరణ్ లతో కొరటాలకి కూడా ఎంతో సాన్నిహిత్యం వుంది. ఆల్రెడీ ఆయన ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' చేయగా .. త్వరలో చరణ్ తో ఓ మూవీ చేసే ఛాన్స్ వుంది.
ఇక ఎన్టీఆర్ .. చరణ్ కలిసి ఓ మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాళ్లిద్దరూ 'భరత్ అనే నేను' ఆడియో వేడుకకి హాజరైతే, ఘట్టమనేని అభిమానులతో పాటు .. నందమూరి అభిమానులు .. మెగా ఫ్యాన్స్ కూడా ఈ స్టేజ్ ముందు చేరిపోవడం ఖాయమని చెప్పొచ్చు. 
Go Back to Shorts
mahesh
charan
ntr

More Telugu News