brittan haies: జీపులోకి ప్రవేశించిన చిరుతను చూసి బిక్కచచ్చిపోయిన టూరిస్టు.. వీడియో చూడండి!

  • టాంజానియా సెరెంగెతీ జాతీయ పార్కులో సఫారీ టూర్ కి వెళ్లిన అమెరికన్
  • జీపులో ప్రయాణిస్తూ జంతువులను చూస్తుండగా ఎదురొచ్చిన చిరుతలు
  • జీపులోకి ప్రవేశించిన చిరుత
సరదాగా జంతువులను చూసేందుకు సఫారీకి వెళ్లిన అమెరికన్ టూరిస్టుని ఓ చిరుతపులి బెంబేలెత్తించిన ఘటన టాంజానియాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని సీటెల్‌ కు చెందిన బ్రిట్టన్‌ హెయెస్‌.. టాంజానియాలో సెరెంగెతీ జాతీయ పార్కులో సఫారీ టూర్‌ కు వెళ్లాడు. ఎంతో ఉత్సాహంగా జీపులో సఫారీని వీక్షిస్తుండగా, ఊహించని సంఘటన చోటుచేసుకుంది.

జీపును నిలిపి జంతువులను చూస్తుండగా, జీపువైపు రెండు చిరుత పులులు దూసుకొచ్చాయి. ఒకటి కారుపైకి ఎక్కగా, రెండోది నేరుగా వెనుక డోర్ లోంచి కారు బ్యాక్ సీట్ పైకి ఎక్కేసింది. దీంతో హెయెస్‌ హడలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన టూర్ గైడ్ కదలకుండా అలాగే ఉండాలని సూచించడంతో బిక్కచచ్చిపోయిన హెయెస్ శ్వాసవేగాన్ని కూడా తగ్గించాడు. కారును కాసేపు పరిశీలించిన చిరుత వెనుదిరగడంతో హాయిగా ఊపిరిపీల్చుకున్నాడు. దీనిపై ఆయన స్పందిస్తూ, చిరుత జీపులోకి ప్రవేశించగానే తన గుండె ఆగినంతపనైందని పేర్కొన్నాడు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 
brittan haies
Safari
Tanzania tour
Tanzania safari tour

More Telugu News