Chandrababu: ఒంటిమిట్ట కోదండరామస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

  • స్వామి వారి కల్యాణ వేడుకకు హాజరైన చంద్రబాబు దంపతులు
  • ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ
  • రామనామ స్మరణతో మార్మోగుతున్న కల్యాణ వేదిక పరిసరాలు  
కడప జిల్లా ఒంటిమిట్ట కోదంద రామస్వామి కల్యాణ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను చంద్రబాబు సమర్పించారు. చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ నేత సీఎం రమేశ్, పలువురు ప్రజా ప్రతినిధులు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. కాగా, రామనామ స్మరణతో కల్యాణ వేదిక పరిసరాలు మార్మోగుతున్నాయి. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 
Chandrababu
ontimitta

More Telugu News