Pawan Kalyan: ‘రంగస్థలం’లో రామ్ చరణ్ నటన అద్భుతం: పీకే క్రియేటివ్ వర్క్స్ ప్రశంసలు

  • ఈ రోజు విడుదలైన 'రంగస్థలం'   
  • దర్శకుడు సుకుమార్, చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు
  • ట్వీట్ ద్వారా పీకే క్రియేటివ్ వర్క్స్ ప్రశంసలు
‘రంగస్థలం’లో రామ్ చరణ్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నిర్మాణ సంస్థ పీకే క్రియేటివ్ వర్క్స్ ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ఓ ట్వీట్ చేసింది. ‘రంగస్థలం’లో అద్భుత నటనను కనబరచిన రామ్ చరణ్ కు, ఈ చిత్రం ఘన విజయం సాధించినందుకు దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నవీన్, చిత్రయూనిట్ కు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోందని పీకే క్రియేటివ్ వర్క్స్ తన  ట్వీట్ లో పేర్కొంది. కాగా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రంగస్థలం’ ఈరోజు విడుదలై, మంచి టాక్ సంపాదించుకుంది.
Pawan Kalyan
Ramcharan

More Telugu News