YSRCP: అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుడు హత్య!

  • రాయలసీమలో కలకలం రేపిన ఫ్యాక్షన్ హత్య
  •  వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి హత్య
  • ప్రత్యర్థులే హతమార్చి ఉంటారని పోలీసుల అనుమానం
రాయలసీమలో ఫ్యాక్షన్ హత్య కలకలం రేపింది. అనంతపురం జిల్లాలో వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. రూరల్ మండలం కందుకూరులో ఈరోజు సాయంత్రం ఈ దారుణం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యర్థులే ఆయన్ని హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.
YSRCP
Anantapur District

More Telugu News