Chandrababu: ఒంటిమిట్టలో వడగండ్ల వాన.. స్వామివారి క‌ల్యాణం చూడ‌కుండానే వెనుదిరుగుతోన్న భక్తులు

షార్ట్స్‌లో చూడండి
కాసేపట్లో కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి కల్యాణం జరగనుంది. అయితే, ఆ ప్రాంతంలో వడ‌గండ్ల వాన కురుస్తుండ‌డంతో భ‌క్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్వామి వారి కల్యాణ వేదిక వద్దకు వర్షపు నీరు చేర‌డ‌మే కాకుండా, ఈదురుగాలులతో కల్యాణ వేదికపై రేకులు ఎగిరిపడ్డాయి. దీంతో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. స్వామివారి కల్యాణం చూడకుండానే కొంద‌రు భ‌క్తులు వెనుదిరుగుతున్నారు. భారీ వ‌ర్షంతో ఒంటిమిట్ట‌లో విద్యుత్ స‌ర‌ఫ‌రా కూడా నిలిచిపోయింది.

మ‌రోవైపు స్వామి వారి క‌ల్యాణం కోసం ఒంటిమిట్ట ఆర్ అండ్ బీ అతిథి గృహానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని పోలీసులకు సూచించారు. ఏపీ ప్రభుత్వం తరఫున స్వామివారికి చంద్రబాబు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. 
Go Back to Shorts
Chandrababu
rain
Kadapa District

More Telugu News