varun tej: మెగా హీరో జోడీగా ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' 
  • హీరోలుగా వెంకీ .. వరుణ్ తేజ్ 
  • నాయికలుగా తమన్నా .. మెహ్రీన్
తెలుగు తెరపై గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన కథానాయికలలో మెహ్రీన్ ఒకరు. వరుసగా మూడు సక్సెస్ లను అందుకున్న మెహ్రీన్, ఆ తరువాత రెండు పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. దాంతో ఆమె కెరియర్ గ్రాఫ్ కొంచెం స్లో అయినా .. వెంటనే పుంజుకుంటోంది. తాజాగా ఆమె అనిల్ రావిపూడి సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది.

 గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెహ్రీన్ 'రాజా ది గ్రేట్' చేయగా, అది ఘన విజయాన్ని సాధించింది. అది సెంటిమెంట్ గా తీసుకున్నాడో ఏమో మళ్లీ తన సినిమాలో ఆమెకి అనిల్ రావిపూడి అవకాశం ఇచ్చాడు. 'ఎఫ్ 2' పేరుతో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లతో ఆయన ఒక మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నాను తీసుకున్న ఆయన, వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.      
varun tej
mehreen

More Telugu News