Narendra Modi: మోదీ వేషధారికి చీరె, సారె ఇచ్చిన టీడీపీ మహిళా నేతలు

  • నెల్లూరులో టీడీపీ మహిళా నేతల వినూత్న నిరసన
  • మోదీ వేషధారికి నల్ల చీర, గాజులు, బొట్టు అందించి నిరసన
  • మోదీకి వ్యతిరేకంగా నినాదాలు
ప్రత్యేక హోదాపై టీడీపీ నేతలు, కార్యకర్తలు పోరాటాన్ని ఉద్ధృతం చేశారు. తాజాగా, నెల్లూరులో టీడీపీ మహిళా నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తికి చీరె, సారె ఇచ్చారు. నల్ల చీర, నల్లటి బొట్టు, నల్ల గాజులు అందించి... వినూత్నంగా నిరసన తెలిపారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మాట్లాడుతూ, మోదీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని విభజన హామీలను నెరవేర్చాలని చెప్పారు.
Narendra Modi
Special Category Status
Telugudesam
protest

More Telugu News