Chandrababu: ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేమీ లేదు: వైసీపీ నేతలపై మండిపడ్డ కేశినేని నాని

  • ఇక్కడ పోరాడుతూ, ఢిల్లీలో కాళ్లు పట్టుకుంటున్నారు
  • కేసులకు భయపడి కేంద్రంతో లాలూచీ పడుతున్నారు
  • రాజీనామాలు చేసి ఇంట్లో కూర్చుంటే.. ఒరిగేదేమీ లేదు
వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. కేసులకు భయపడి కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ లాలూచీ పడుతోందని విమర్శించారు. ఎంపీలంతా రాజీనామా చేసి, ఇంట్లో కూర్చుంటే ఒరిగేదేమీ లేదని ఆయన అన్నారు. ఢిల్లీ వేదికగానే ఏపీ ప్రజల గళాన్ని వినిపించాలని చెప్పారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటూనే... ఢిల్లీలో ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పారు. ఏప్రిల్ 2, 3 తేదీల్లో చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని... కేంద్రంపై అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన పార్టీల నేతలతో ఆయన భేటీ అవుతారని చెప్పారు. 
Chandrababu
YSRCP
Kesineni Nani
no confidence motion

More Telugu News