Chandrababu: చంద్రబాబుతో భేటీ అయిన రాఘవేంద్రరావు

  • టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వనున్నారనే ప్రచారం
  • ప్రస్తుతం బోర్డు సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు
  • ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ దర్శకుడు రాఘవేంద్రుడు భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆయన టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవిని ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. మొదటి నుంచి కూడా టీడీపీకి దగ్గరగా రాఘవేంద్రరావు ఉంటూ వస్తున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా పార్టీకి సంబంధించిన లఘుచిత్రాలకు ఆయనే రూపకల్పన చేశారు. చంద్రబాబుతో భేటీ సాధారణ సమావేశమేనా లేక కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? అనే విషయంపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 
Chandrababu
raghavendra rao
ttd

More Telugu News