raviteja: కాన్సెప్ట్ కొత్తది .. ఆలోచనలో పడిన రవితేజ!

  • విభిన్న కథాచిత్రాల దర్శకుడు వి.ఐ.ఆనంద్ 
  • కొత్త కాన్సెప్ట్ తో రవితేజను కలిసిన దర్శకుడు 
  • రవితేజ నుంచి రావలసిన సమాధానం
'రాజా ది గ్రేట్ ' కథను చాలామంది హీరోలకు ఆ దర్శకుడు వినిపించాడు. అయితే ఆ పాత్రను చేసే సాహసం మాత్రం రవితేజనే చేశాడు. అందువల్లనే విజయం ఆయన సొంతమైంది .. ఆయన కెరియర్లో ఆ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. అలాంటి మరో ప్రయోగాత్మకమైన పాత్రను రవితేజ చేసే ఛాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

'ఎక్కడికిపోతావు చిన్నవాడా' .. 'ఒక్క క్షణం' వంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసిన వి.ఐ.ఆనంద్, రీసెంట్ గా ఒక కథను రవితేజకు వినిపించాడట. ఇది కూడా ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ అని సమాచారం. అయితే ఈ కొత్తదనాన్ని ఎంతవరకూ ఆడియన్స్  రిసీవ్ చేసుకుంటారనే విషయం గురించే రవితేజ ఆలోచన చేస్తున్నాడట. ఆయన ఓకే అంటే మాత్రం సెట్స్ పైకి వెళ్లడానికి ఎంతో సమయం పట్టదు.     
raviteja
anand

More Telugu News