jayanthi: త్వరలోనే నటి జయంతికి వెంటిలేటర్ తొలగింపు.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కర్ణాటక ముఖ్యమంత్రి!

  • కోలుకుంటున్న నటి జయంతి
  • విక్రమ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స
  • జయంతితో చాలా సేపు ముచ్చటించిన సిద్ధరామయ్య
సీనియర్ సినీ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఒకానొక సమయంలో ఆమె చనిపోయారంటూ వార్తలు కూడా వచ్చాయి. శ్వాసకోస వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమె... ప్రస్తుతం బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని... త్వరలోనే ఆమెకు అమర్చిన వెంటిలేటర్ ను తొలగిస్తామని వైద్యులు తెలిపారు.

మరోవైపు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆసుపత్రికి వెళ్లి, జయంతిని పరామర్శించారు. ఆమెతో చాలా సేపు ముచ్చటించారు. ఆమెకు ధైర్యం చెప్పారు. జయంతి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని చెప్పారు. 
jayanthi
actress
siddaramaiah
Karnataka
cheif minister
health
treatment

More Telugu News