Pakistan: 'ఎయిర్‌పోర్టులో పాక్‌ ప్రధానికి అవమానం' ఘటనపై వివరణ ఇచ్చిన అమెరికా దౌత్యాధికారి

  • ఓ దేశ ప్రధాని డిప్లొమటిక్‌ పాస్‌పోర్ట్‌ లేకుండా ప్రైవేట్‌గా ప్రయాణిస్తే ఇలాగే తనిఖీలు చేస్తారు  
  • వారిని సామాన్య పౌరులుగానే భావిస్తారు
  • అధికారిక పర్యటనలో మాత్రం ఇలా చేయరు
అమెరికా విమానాశ్రయంలో పాకిస్థాన్ ప్రధానమంత్రి అబ్బాసీకి అవమానం జరిగిన విషయం తెలిసిందే. ఆయన బ్యాగు, కోటు  పట్టుకుని ఎయిర్ పోర్టు సెక్యూరిటీ నడుచుకుంటూ వెళ్లిన ఓ వీడియో మీడియాకు చిక్కడంతో అమెరికాపై పాకిస్థానీయులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అమెరికా దౌత్యాధికారి అలెక్జాండెర్‌ మెక్‌లారెన్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ఎయిర్ పోర్టు సిబ్బంది అలా ఎందుకు చేశారో వివరించారు.

తనకు తెలిసింతన వరకు ఓ దేశ ప్రధాని డిప్లొమటిక్‌ పాస్‌పోర్ట్‌ లేకుండా ప్రైవేట్‌గా పర్యటించాలనుకున్నప్పుడు వారిని సామాన్య పౌరులుగానే భావిస్తారని, అలాంటప్పుడు సామాన్యుడిని ఎలా తనిఖీ చేస్తారో ప్రధానిని కూడా అలాగే చేస్తారని వివరించారు. అధికారిక పర్యటనలో మాత్రం ఇలా చేయరని చెప్పారు. 
Pakistan
america
Prime Minister
abbasi

More Telugu News