అన్నం పెట్టిన చేతినే బీజేపీ నేతలు నరికేస్తున్నారు : బుద్దా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
ప్రజల కోసం పోరాడతారని పదవులు ఇస్తే, అన్నం పెట్టిన చేతినే బీజేపీ నేతలు నరికేస్తున్నారని ఏపీ టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీతో పొత్తు లేకుండా సోము వీర్రాజు, మాధవ్ లు ఎమ్మెల్సీలు కాగలిగేవారా? అఖిలపక్షం భేటీకి బీజేపీ ఎందుకు హాజరు కాలేదు? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ అప్పులివ్వాలని చంద్రబాబు చేసిన ప్రకటనపై బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని, ఈ పరిస్థితికి కారణం బీజేపీ కాదా? అని మండిపడ్డారు. ప్రధాని మోదీ వీడియోలు అసెంబ్లీలో ప్లే చేస్తే బీజేపీ నేతల కుర్చీలు కదులుతున్నాయని విమర్శించారు.
Go Back to Shorts
BJP
budda venkanna

More Telugu News