rafale jets: ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తున్న యుద్ధ విమానాల ధరను చెప్పలేం: రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్

  • రాఫెల్ విమానాల ధరలను చెప్పలేం
  • దేశ భద్రత కోసం బహిర్గతం చేయలేం
  • రాహుల్ అనవసర ఆరోపణలు చేస్తున్నారు
ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్ విమానాలను భారత్ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒప్పందంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేస్తున్న యుద్ధ విమానాల ధరలను వెల్లడించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, విమానాల ధరలను చెప్పలేమని తెలిపారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఒప్పందం వివరాలను బహిర్గతం చేయలేమని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆయుధం దొరుకుతుందేమో అని రాహుల్ వెతుకుతున్నారని... ఆయనకు ఏదీ దొరక్కపోవడంతో, ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వాయుసేనకు రాఫెల్ ఒప్పందం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు.
rafale jets
purchase
nirmala seetharaman
Rahul Gandhi

More Telugu News