Chandrababu: చంద్రబాబు జపాన్ తరహా ఉద్యమం చేద్దామంటారు.. జపాన్ లో అవినీతికి పాల్పడితే ఉరితీస్తారు మరి!: సీపీఐ రామకృష్ణ

  • జపాన్ తరహాలో అన్నీ అమలు చేస్తారా?
  • బాబు సింగపూర్, జపాన్ మాటలు మానుకోవాలి
  • బాబు పోరాటంపై మాకు నమ్మకం లేదు
జపాన్‌ తరహాలో ఉద్యమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెబుతున్నారని, జపాన్‌ లో అవినీతికి పాల్పడితే ఉరితీస్తారని, ఇప్పటికే అవినీతి మంత్రులను జైల్లో పెట్టారని, ఇక్కడ కూడా అలా పెడతారా? అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

ఒంగోలులో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు జపాన్‌, సింగపూర్‌ లాంటి మాటలు మానుకోవాలని, మాటలు మాని చేతలు మొదలు పెట్టాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు చేస్తున్న పోరాటంపై తమకు నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. హోదా ఉద్యమాలపై బాబు ఆంక్షలు విధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు ఉద్యమాలు చేసే వారి మాయలో పడొద్దని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు పిలుపునిస్తున్నారని ఆయన విమర్శించారు. 
Chandrababu
ramakrushna
cpi

More Telugu News