airport: శంషాబాద్‌ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు ఆటంకం

షార్ట్స్‌లో చూడండి
హైద‌రాబాద్ శివారు శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయంలో నిన్న రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్‌ సమయంలో టైర్‌ పేలిపోయిన విషయం విదితమే. దీంతో మంటలు వ్యాపించి, రన్‌వే పైనే ఆ విమానం నిలిచిపోయింది. దీంతో ఈ రోజు విమానాశ్రయంలో విమాన రాకపోకలు నిలిచిపోయిన‌ట్లు తెలిపిన అధికారులు... రన్‌వేను క్లియర్‌ చేసి వీలైనంత త్వ‌ర‌లో సర్వీసులు పునరుద్ధరిస్తామని ప్ర‌క‌టించారు. కాగా, నిన్న రాత్రి తిరుపతి నుంచి వచ్చిన ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా సహా 70 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడిన విషయం తెలిసిందే. 
Go Back to Shorts
airport
roja
Hyderabad

More Telugu News