chalasani srinivas: ఇకపై కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే ఉద్యమాలు చేపడతాం : చలసాని శ్రీనివాస్

  • ఏపీకి కేంద్రం చాలా అన్యాయం చేసింది
  • రాజకీయంగా పబ్బం గడుపుకుంటోంది
  • రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోంది 
ఇకపై కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టే ఉద్యమాలు చేస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. విశాఖపట్టణంలో సీపీఎం నిర్వహించిన పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిర్వహించిన బహిరంగ సభలో చలసాని మాట్లాడుతూ, ఏపీకి కేంద్రం చాలా అన్యాయం చేసిందని, రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. మహారాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.57 వేల కోట్లు కేటాయించగా, ఏపీకి కేవలం రూ. 3,670 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని విమర్శించారు.
chalasani srinivas
visaka

More Telugu News