Pawan Kalyan: ప్రత్యేక హోదాపై పోరు.. విజయవాడకు వెళ్లనున్న పవన్ కల్యాణ్

  • వచ్చే నెల 4, 5 తేదీల్లో విజయవాడకు పవన్
  • తమ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు
  • పార్టీ బలోపేతంపై కూడా చర్చలు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందుకోసం పోరుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వచ్చే నెల 4, 5 తేదీల్లో విజయవాడకు వెళ్లి తమ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశాలు జరపనున్నారు. అలాగే, జనసేన పార్టీని బలోపేతం చేసే అంశంపై కూడా తమ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. తమ పార్టీ కార్యవర్గం, పలు విభాగాలకు అధ్యక్షుల నియామకం వంటి వాటిపై కీలక చర్చలు జరుపుతారు. ఇటీవలే పవన్ కల్యాణ్ విజయవాడకు వెళ్లి వామపక్ష నేతలతో చర్చించిన విషయం తెలిసిందే.
 
Pawan Kalyan
Vijayawada
Jana Sena

More Telugu News