airtel: రూ.65కే 1జీబీ డేటా... 28 రోజుల వ్యాలిడిటీ... ఎయిర్ టెల్ ఆఫర్

  • 2జీ లేదా 3జీ డేటాతో కూడిన పథకం
  • రూ.98 రీచార్జ్ పై మాత్రం 4జీ డేటా 2జీబీ ఉచితం
  • కొందరు కస్టమర్లకు 5జీబీ వరకు డేటా
భారతీ ఎయిర్ టెల్ తక్కువ నెట్ వినియోగించే వారి కోసం ఓ కొత్త పథకాన్ని ప్రకటించింది. కేవలం రూ.65కే 1జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. వ్యాలిడిటీ 28 రోజులు. కాకపోతే ఇది 4జీ డేటా కాదు. 2జీ/3జీ డేటాకే పరిమితం. ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం ఉద్దేశించినది ఈ పథకం. ఒకవేళ మరింత వేగంతో కూడిన 4జీ డేటానే కావాలనుకునే వారి కోసం ఇంకో పథకాన్ని కూడా తీసుకొచ్చింది. రూ.98 రీచార్జ్ చేసుకుంటే 2జీబీ 4జీ/3జీ డేటాను 28 రోజుల పాటు పొందొచ్చు. ఎంపిక చేసిన కొందరు ఖాతాదారులకు రూ.98 రీచార్జ్ పై 28 రోజుల వ్యాలిడిటీతో 5జీబీ కూడా ఆఫర్ చేస్తోంది.

పోటీ సంస్థ జియోలోనూ డేటాతో కూడిన తక్కువ విలువ కలిగిన రెండు పథకాలున్నాయి. రూ.49కే నెలంతా అన్ లిమిటెడ్ కాలింగ్, 1జీబీ డేటా ప్లాన్ కేవలం జియో ఫోన్లు వాడే వారికి పరిమితం. రూ.98 ప్లాన్ పై 2జీబీ 4జీ డేటాను 28 రోజుల కాలపరిమితితో అందిస్తోంది. అలాగే, అపరిమిత కాలింగ్, 300 ఉచిత ఎస్ఎంఎస్ లు కూడా పొందొచ్చు.
airtel
data plan offers

More Telugu News