nani: 'లిటిల్ రాస్కెల్' అంటూ కొడుకుతో నాని ముచ్చట!

  • క్రితం ఏడాదే తండ్రైన నాని 
  • కొడుకు పేరు అర్జున్
  • ముద్దుపేరు 'జున్ను'
తెలుగు తెరపై నేచురల్ స్టార్ గా మార్కులు కొట్టేసిన నాని, క్రితం ఏడాదే తండ్రి అయ్యాడు. తన కొడుక్కి ఆయన అర్జున్ అనే పేరు పెట్టాడు. షూటింగ్ లేకపోతే ఆ సమయాన్ని తన తనయుడికి కేటాయించడమే నానికి అలవాటు. అలా తన తనయుడితో గడిపే మరపురాని క్షణాలకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయన అభిమానులకు ఆనందాన్ని పంచుతుంటాడు.

 తన తనయుడు అర్జున్ తొలి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఆయన తనదైన స్టైల్లో శుభాకాంక్షలు తెలియజేశాడు. 'ది లిటిల్ రాస్కెల్ టర్న్స్ వన్  టుడే .. దొంగ నా కొడుకు .. 'జున్ను'గాడు .. అంటూ కొడుకు పట్ల తనకి గల ప్రేమను చాటుకున్నాడు. ఈ  సందర్భంగా ఆయన పోస్ట్ చేసిన ఫొటో అభిమానుల ముచ్చట తీర్చేదిలా వుంది.    
nani
arjun

More Telugu News