urvashi rautela: సినీ నటి ఆధార్ నెంబర్ తో.. స్టార్ హోటల్ లో రూమ్ బుకింగ్!

  • నటి ఊర్వసి రౌతేలా పేరిట రూమ్ బుకింగ్
  • బాంద్రా పోలీసులకు ఫిర్యాదు
  • ఐసీపీ 420, ఐటీ యాక్టుల కింద కేసు నమోదు
ముంబైలోని ఓ స్టార్ హోటల్ లో సినీ నటి ఊర్వశి రౌతేలా పేరిట నకిలీ ఆధార్ కార్డులతో రూమ్ బుక్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. గుర్తు తెలియని వ్యక్తులు తన పేరిట ఆన్ లైన్ లో గదిని బుక్ చేశారని ఊర్వశి తెలిపింది. దానికి తన పేరిట ఉన్న నకిలీ ఆధార్ కార్డును ఉపయోగించారని వెల్లడించింది. జరిగిన ఘటనపై ఆమె ముంబైలోని బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు బుక్ చేశారు. ఐపీసీ 420తో పాటు ఐటీ యాక్టుల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.  
urvashi rautela
actress
room booking

More Telugu News