డేటా లీక్ వ్యవహారంలో ఫేస్‌బుక్‌కు కేంద్ర సర్కారు నోటీసులు
- డేటా లీక్ వ్యవహారంపై దృష్టిపెట్టిన కేంద్ర సర్కారు
- ఏప్రిల్ 7లోగా ఈ విషయంపై వివరాలు ఇవ్వాలని ఆదేశం
- భారత ఎన్నికల ప్రక్రియను ఫేస్బుక్ ప్రభావితం చేస్తోందా? అనే విషయం రాబట్టనున్న సర్కారు
తమకు ఈ విషయంపై వివరాలు తెలపాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఫేస్‌బుక్‌కు లేఖ రాసింది. ఫేస్‌బుక్‌లోని భారత ఖాతాదారుల సమాచారాన్ని ఉపయోగించుకొని గతంలోనూ భారత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు ఏ సంస్థలయినా ప్రయత్నించాయా? అన్న విషయాన్ని తెలుసుకోవడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.