Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడితో నీతి ఆయోగ్ సభ్యుడు సారస్వత్ కాసేపు చ‌ర్చించారు. వారి మ‌ధ్య‌ ముఖ్యంగా చింతలపూడి, నూజివీడుతో పాటు ప‌లు ప్రాంతాల్లో బొగ్గు నిల్వల నుంచి ఇథనాల్ ఉత్పత్తిపై చ‌ర్చ జ‌రిగింది. అందుకు సంబంధించిన వివ‌రాల‌ను చంద్ర‌బాబుకు సారస్వ‌త్ వివ‌రించారు.

ఇథనాల్ థర్మల్ పవర్ ప్లాంట్లలో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని సారస్వత్ తెలిపిన‌ట్లు తెలిసింది. ఈ విష‌యంలో ఏపీ స‌ర్కారు చొర‌వ చూపితే తాము ఇజ్రాయెల్ సాయం కోరతామని తెలిపారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలించి అందుకు త‌గ్గ‌ట్లు ముందుకు వెళ్లాలని చంద్ర‌బాబు నాయుడు ఏపీ ప్ర‌భుత్వాధికారుల‌ను ఆదేశించారు.
Go Back to Shorts
Chandrababu
niti ayog
Andhra Pradesh

More Telugu News