Andhra Pradesh: నాకు తెలిసిన విషయాన్ని సూటిగా చెప్పాను: నటుడు శివాజీ

  • ప్రజలను అప్రమత్తం చేయడానికే ‘ఆపరేషన్ గరుడ’ బయటపెట్టా
  • ఇంత కీలకమైన సమాచారాన్ని ఏడాది క్రితమే సేకరించా
  • బీజేపీ కుట్ర గురించి బయటపెడితే.. టీడీపీ వాడినంటూ ముద్ర వేస్తున్నారు  
తనకు తెలిసిన విషయాన్ని సూటిగా చెప్పానని ‘ఆపరేషన్ ద్రవిడ’ పేరిట సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు శివాజీ అన్నారు. ‘ఎన్టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘‘ఆపరేషన్ గరుడ’ ఆంధ్ర ప్రజలను అప్రమత్తం చేయడానికే బయటపెట్టాను. ఇంత కీలకమైన సమాచారాన్ని నేను సంవత్సరం క్రితమే సేకరించాను. తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఇదే సరైన సమయం అని భావించి ఆ విషయాలను బయటపెట్టాను.

నేను బీజేపీ కుట్ర గురించి బయటపెడితే.. టీడీపీ వాడినంటూ నాపై ముద్ర వేస్తున్నారు. నాకు ఏ పార్టీలు, పదవులు వద్దు. నా అస్థిత్వం కోసం నేనేమీ పాకులాడట్లేదు. నాపై వస్తున్న విమర్శలను పట్టించుకోను. నాకు సినిమాలు లేకపోవడంతోనే ఇదంతా చేస్తున్నానని విమర్శిస్తున్నారు. నా చివరి సినిమా 'బూచమ్మ బూచోడు'. ఈ సినిమా హిట్ అయింది. నేనేమీ ఫెయిల్యూర్ నటుడిగా బయటకు రాలేదు. ఇప్పటివరకు 90 సినిమాల్లో నటించాను’ అని చెప్పుకొచ్చారు.
Andhra Pradesh
artist shivaji

More Telugu News