mamatha: ఢిల్లీలో బీజేపీ రెబల్‌ నేతలతో మమతా బెనర్జీ భేటీ

  • ఎన్డీఏకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో బలమైన కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు
  • శత్రుఘ్న సిన్హా, యశ్వంత్ సిన్హాలతో పాటు పలువురు నేతలు సమావేశం
  • ఎన్డీఏపై పోరాటం చేసే అంశంపై చర్చలు
ఎన్డీఏకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో బలమైన కూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఈ రోజు కూడా పలువురు నేతలను కలిసి చర్చలు జరిపారు. సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ నేతలు శత్రుఘ్నసిన్హా, యశ్వంత్ సిన్హాలతో మమతా బెనర్జీ చర్చించారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్ తో పాటు పలువురు నేతలతో  కూడా ఆమె మాట్లాడారు.

మమతా బెనర్జీ నాయకత్వంలో మహా కూటమిని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాటం చేసే అంశంపై తాము చర్చించినట్లు ఆజంఖాన్ మీడియాకు చెప్పారు. కాగా, నిన్న ఢిల్లీలో మమతా బెనర్జీ.. ఎన్సీపీ నేత శరద్ పవార్, శివసేన నేత సంజయ్ రౌత్, ఆర్జేడీ ఎంపీ మీసా భారతిలతో పాటు పలువురు నేతలతో చర్చించిన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ అధిష్ఠానంతో కూడా చర్చలు జరపనున్నారు.
mamatha
West Bengal
New Delhi

More Telugu News