butta renuka: కుటుంబసభ్యులతో కలసి మోదీని కలసిన బుట్టా రేణుక

  • మోదీతో భేటీ వ్యక్తిగతమన్న రేణుక
  • రాజకీయాలు చర్చించలేదన్న ఎంపీ
  • చర్చనీయాంశంగా మారిన భేటీ
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ప్రధాని మోదీని కలిశారు. తన కుటుంబసభ్యులతో కలసి మోదీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, మోదీతో భేటీ పూర్తిగా వ్యక్తిగత అంశమని చెప్పారు. ప్రధానితో రాజకీయపరమైన అంశాలను చర్చించలేదని తెలిపారు. వైసీపీ నుంచి ఎంపీగా ఎన్నికైన బుట్టా రేణుక గత కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో టీడీపీకి దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో, మోదీతో భేటీ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
butta renuka
Narendra Modi
meeting

More Telugu News