Tirumala: తిరుమల శ్రీవారి బూంది పోటులో భారీ అగ్నిప్రమాదం...ఎగసిపడుతున్న మంటలు

  • ఉవ్వెత్తున ఎగసిపడుతున్న మంటలు
  • రెండు ఫైరింజన్లతో అదుపు చేస్తున్న సిబ్బంది
  • ఆందోళనతో భక్తుల 'గోవిందా' నామస్మరణ
తిరుమలలోని శ్రీవారి బూంది పోటులో ఈ రోజు మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఉవ్వెత్తున భారీగా ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక దళ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింటుందని టీటీడీ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిసింది.

కాగా, పగలు రాత్రి అనే తేడా లేకుండా ఎల్లప్పుడూ భక్తులతో కిటకిటలాడే తిరుమలలో ఇలా ఒక్కసారిగా బూంది పోటు నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. కొందరైతే ఎలాంటి ఘోరం జరగకుండా కాపాడాలంటూ 'గోవిందా...గోవిందా...' నినాదాలు చేశారు.
Tirumala
Boondi Potu
Fire Accident

More Telugu News