Chandrababu: విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలపై శాసనసభలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగం!

  • ప్రధాని కాళ్లు మొక్కి బయటకు వచ్చి.. నాపై అటువంటి వ్యాఖ్యలు చేశారు 
  • 'తల్లి, తండ్రికీ పుట్టిన వాడైతే'... అంటూ మాట్లాడారు
  • చెప్పుకోలేని పదాలతో విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారు
  • రాజకీయాల్లో నేను 40  ఏళ్లుగా హుందాగా వ్యవహరిస్తున్నా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఢిల్లీలో వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు ఈ రోజు శాసనసభలో స్పందించారు. ప్రధానమంత్రి కాళ్లు మొక్కి బయటకు వచ్చి.. తనపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు నాయుడు అన్నారు. 'తల్లి, తండ్రికీ పుట్టిన వాడైతే'... అంటూ తనపై దారుణంగా వ్యాఖ్యలు చేశారని చంద్రబాబు భావోద్వేగపూరితంగా మాట్లాడారు.

చెప్పుకోలేని పదాలతో విజయ సాయిరెడ్డి విమర్శలు చేశారని, రాజకీయాల్లో తాను 40 ఏళ్లుగా హుందాగా వ్యవహరిస్తున్నానని, తాను వ్యక్తిగతంగా ఎవ్వరినీ ఒక్క మాటా అనలేదని చెప్పారు. తనకు రాజకీయం ముఖ్యం కాదని, ఎవరిపైనా కోపం లేదని అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం తాను కేంద్ర ప్రభుత్వంపై చేసే పోరాటానికి ఐదుకోట్ల మంది మద్దతు తెలపాలని కోరారు.
Chandrababu
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News