kcr: కేసీఆర్ ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలి : విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోమారు వ్యాఖ్యలు చేశారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన కేసీఆర్ ను చూసి చంద్రబాబునాయుడు నేర్చుకోవాలని అన్నారు. ఢిల్లీలో విలేకరులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ,  తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానన్న కేసీఆర్ ని చూసి చంద్రబాబు నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉందని సూచించారు.

ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రశ్నించకపోవడం దారుణమని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కదారి పట్టించొద్దని, మళ్లీ యూ టర్న్ తీసుకోవద్దని చంద్రబాబుకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
Go Back to Shorts
kcr
Chandrababu
Vijay Sai Reddy

More Telugu News