Chandrababu: నిన్న సభకు ఎందుకు రాలేదు?.. మీ ఉద్దేశం ఏమిటి?: ప్రతిపక్షాలపై చంద్రబాబు మండిపాటు

  • బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల ఉద్దేశం ఏమిటి?
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం పిలిచినప్పుడు అందరూ రావాలి
  • పోలవరంపై అపవాదులు వేసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్నారు
  • ప్రజలు క్షమించరు
నిన్న తాము నిర్వహించిన అఖిలపక్ష సంఘాల సభకు బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల నేతలు ఎందుకు రాలేదని, వారి ఉద్దేశం ఏమిటని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పిలిచినప్పుడు అందరూ రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన శాసనసభలో మాట్లాడుతూ... ప్రతిపక్ష పార్టీలు పోలవరంపై అపవాదులు వేసి రాజకీయ లబ్ది పొందాలనుకుంటే ప్రజలు క్షమించరని అన్నారు.

రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలని, అలాగే హింసకు తావివ్వకూడదని, అహింసా విధానంలో పోరాడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విద్యార్థులు నిర్మాణాత్మకంగా పోరాడాలని, ప్రజలను చైతన్య పరచాలని అన్నారు. తాము ఢిల్లీకి వెళతామని, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లి పోరాడతామని చెప్పారు. 
Chandrababu
Telugudesam
YSRCP
Jana Sena

More Telugu News