laloo prasad yadav: లాలూ ప్రసాద్ కుమారుడిని ప్రశంసించిన బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా!

  • తేజస్వికి మంచి భవిష్యత్తు ఉంది
  • నితీష్ కుమార్ కు పోటీ అవుతాడు
  • లాలూను కలవడం చాలా సంతోషంగా ఉంది
బీజేపీపై అనునిత్యం విరుచుకుపడే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ పై బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా ప్రశంసల జల్లు కురిపించారు. తేజస్వికి మంచి భవిష్యత్తు ఉందని ఆయన ప్రశంసించారు. రాజకీయాల్లో తేజస్వి పరణతి చూస్తుంటే ముచ్చటేస్తోందని అన్నారు. తేజస్విని చూస్తుంటే చిన్నప్పటి శరద్ పవార్ గుర్తొస్తున్నారని చెప్పారు. లాలూ నివాసానికి వెళ్లిన సందర్భంగా ఆయన ఈ మేరకు కితాబిచ్చారు.

రాబోయే ఎన్నికల సమయానికి తేజస్వి మరింత రాటుదేలుతాడని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు పోటీ అవుతాడని శతృఘ్నసిన్హా అన్నారు. పట్నా ఆసుపత్రిలో ఉన్న లాలూను కూడా ఆయన కలిశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, చాలా రోజుల తర్వాత లాలూను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. 
laloo prasad yadav
tejaswi yadav
Shatrughan Sinha
nitish kumar
BJP

More Telugu News