Chandrababu: చంద్రబాబుకు ఇదే నా సవాల్: విజయసాయి రెడ్డి

  • కేసుల నుంచి తప్పించుకునేందుకు స్టే తెచ్చుకున్న చంద్రబాబు
  • నాలుగేళ్లుగా ప్రధాని వద్ద లాలూచీ రాజకీయాలు
  • ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్న విజయసాయి
తనపై ఉన్న కేసుల విచారణ జరుగకుండా కోర్టుల నుంచి స్టే తెచ్చుకుని, నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీతో లాలూచీ రాజకీయాలు జరిపిన చంద్రబాబునాయుడి వైఖరిని ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం పార్లమెంట్ ముందు మీడియాతో మాట్లాడిన ఆయన, నిన్న తనను ఉద్దేశించి సీఎం రమేష్ చేసిన సవాల్ ను ప్రస్తావించారు. తాను రమేష్ కు కాకుండా, చంద్రబాబుకే సవాల్ విసురుతున్నానని, ఎవరు లాలూచీ పడుతున్నారో, బహిరంగ వేదికపై చర్చకు సిద్ధమని, న్యాయ నిపుణులు, రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిచి, వారి మధ్య చర్చించేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు. ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని, సమయం, ప్రాంతం చంద్రబాబే డిసైడ్ చేసుకోవచ్చని అన్నారు.
Chandrababu
Narendra Modi
Vijayasai Reddy

More Telugu News