Telangana: సాంకేతిక కారణాలతో.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సీఎం రమేష్!

  • ప్రస్తుతం తెలంగాణ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్
  • ఇటీవల టీడీపీ నుంచి ఏపీ తరఫున ఎన్నిక
  • సాంకేతిక కారణాలతో రాజీనామా
తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా త్వరలో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేత సీఎం రమేష్ తన పదవికి ముందుగానే రాజీనామా చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా, టీడీపీ తరఫున ఆయన ఎంపికైన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాల దృష్ట్యా, ఒకే సమయంలో అటు ఏపీ, ఇటు తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడానికి వీల్లేదు కాబట్టి ఆయన రాజీనామా చేశారు. వాస్తవంగా ఏప్రిల్ 2 వరకూ సీఎం రమేష్ పదవీ కాలం ఉన్నప్పటికీ, ఏపీ నుంచి ఎన్నికైనందున, ఆయన తెలంగాణ పేరిట కొనసాగరాదని నిర్ణయించుకుని రాజీనామా చేశారు. సీఎం రమేష్ రాజీనామాను వెంటనే ఆమోదించినట్టు తెలుస్తోంది.
Telangana
Andhra Pradesh
CM Ramesh
Resign

More Telugu News