Madhya Pradesh: కడుపునిండా తిన్నాడని పనివాడిని నగ్నంగా నిలబెట్టిన యజమానులు!

  • మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా కేంద్రంలో దాబాలో పని చేస్తున్న వ్యక్తి
  • పని చేసి కడుపునిండా తినడాన్ని చూసిన యజమానులు
  • ఆగ్రహంతో దాడి చేసి బలవంతంగా బట్టలిప్పించి, నగ్నంగా నిలబెట్టిన యజమానులు
బండెడు చాకిరీ చేసి కడుపునిండా తినడం కూడా నేరంగా మారడంతో నగ్నంగా నిలబడాల్సిన శిక్షను ఓ వ్యక్తి ఎదుర్కున్న అమానవీయ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లా కేంద్రంలోని ఒక దాబాలో పని చేస్తున్న వ్యక్తి ఆహారం ఎక్కువగా తిన్నాడు. దీనిని గమనించిన యజమాని, అతని పార్టనర్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. అయినా కోపం చల్లారని వారు అతనిచేత బలవంతంగా బట్టలిప్పించి, నగ్నంగా నిలబెట్టారు. క్షమాపణలు చెబుతున్నా వినకుండా అతనిపై దాడికి దిగారు. దీనిపై దాబాకు వచ్చిన వారు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 
Madhya Pradesh
betul
food

More Telugu News