Chandrababu: నా పోరాటానికి ఎవరు అడ్డొచ్చినా... అడ్రస్ గల్లంతే: చంద్రబాబు

  • హోదా కోసం అవిశ్రాంత పోరాటం
  • ప్రజలను అవమానిస్తున్న బీజేపీ
  • కేసుల మాఫీకే వైసీపీ డ్రామాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే దిశగా తాను అవిశ్రాంత పోరాటానికి దిగానని, తన పోరాటానికి ఎవరు అడ్డు వచ్చినా గల్లంతవడం ఖాయమని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తన ఇంటి వద్దకు వచ్చిన బుడగ జంగాలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు, పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తన డిమాండని అన్నారు.

హోదా ఇచ్చే పరిస్థితి లేదని చెబితేనే ప్యాకేజీకి అంగీకరించామని మరోసారి స్పష్టం చేసిన ఆయన, అది కూడా ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. తమపై ఉన్న అక్రమాస్తుల కేసులను మాఫీ చేసుకునేందుకే వైసీపీ, బీజేపీ ముందు లొంగిపోయిందని ఆయన అన్నారు. వైసీపీ నేతలు ఢిల్లీలో ప్రధాని కాళ్లు మొక్కుతున్నారని, ఏపీలో కాలు దువ్వుతున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర ప్రజలను అవమానిస్తోందని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Chandrababu
Special Category Status
Andhra Pradesh

More Telugu News