Indian Railway: లక్షాధికారి కావాలనుకుంటున్నారా? అయితే, రైల్వేకు ఒక్క సలహా ఇవ్వండి చాలు!

  • రైల్వే ఆదాయాన్ని పెంచే మూడు సలహాలకు రూ.10 లక్షలు
  • వెయ్యి పదాల్లో పంపిస్తే సరి
  • సలహాలు పంపడానికి చివరి తేదీ మే 19
లక్షాధికారులు కావాలనుకునే వారికి భారతీయ రైల్వే అద్భుత అవకాశాన్ని ఇస్తోంది. కేవలం ఒకే ఒక్క సలహాతో ఏకంగా పది లక్షల రూపాయలు గెలుచుకునే అవకాశాన్ని ఇస్తోంది. రైల్వే అందిస్తున్న ప్రస్తుత సేవలను మరింత మెరుగుపరుచుకునే పనిలో పడింది. అందులో భాగంగా ప్రజల నుంచి సలహాలు కోరుతోంది. ఏం చేస్తే రైల్వే ఆదాయం మరింత పెరుగుతుందో చెప్పాలంటూ సలహాలు కోరుతోంది.

మంచి సలహాలు ఇచ్చే వారికి మొత్తం పది లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు  ప్రకటించింది. రెండో అత్యుత్తమ సలహాకు రూ.5 లక్షలు, మూడో సలహాకు రూ.3 లక్షలు, నాలుగో సలహాకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్టు ఇండియన్ రైల్వే ప్రకటించింది.   https://innovate.mygov.in/jan-bhagidari/ వెబ్‌సైట్‌ ద్వారా మంచి సలహాలు ఇవ్వవచ్చని తెలిపింది. సలహాలు పంపడానికి చివరి తేదీ మే 19గా పేర్కొంది.

మంచి సలహాలు ఇచ్చి తమను తాము నిరూపించుకోవాలని జెన్ భగీదరీ వెబ్‌సైట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సలహాలు పూర్తిగా వ్యాపార కోణంలోఉండాలని, రైల్వే ఆదాయాన్ని పెంచేందుకు ఇవి సాయపడాలని తెలిపారు. మొత్తం మూడు దశల్లో ఉండే ఈ పోటీలో ప్రజలు ఇచ్చే సలహా వెయ్యి పదాలలో ఉండాలి. సో.. ఇంకెందుకాలస్యం.. మెదడుకు పనిచెప్పి లక్షలు సొంతం చేసుకోండి మరి! 
Indian Railway
Idea
reward

More Telugu News