Chandrababu: నా పోరాటానికి ఎవరు అడ్డొచ్చినా వారి అడ్రసు గల్లంతే!: సీఎం చంద్రబాబు హెచ్చరిక

  • బీజేపీకి సరెండర్ అయిపోయే పరిస్థితికి వైసీపీ వచ్చింది
  • మొన్నటి వరకు సహకరించిన ‘జనసేన’ ఇప్పుడు మాపై పడింది
  • ఎవరెన్ని మాట్లాడినా భయపడే సమస్యే లేదు
  • ఎన్ని శక్తులు అడ్డొచ్చినా ముందుకుపోతాం  
రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను చేస్తున్న పోరాటానికి ఎవరు అడ్డొచ్చినా వారి అడ్రసు గల్లంతవుతుందని సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. సీఎం నివాసం దగ్గర బుడగ జంగాల మహాసభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశానని అన్నారు. దీంతో, రాష్ట్రంపై కక్ష కట్టే పరిస్థితికి కేంద్రం వచ్చిందని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయకపోతే వదిలిపెట్టనని కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తుంటే, రాష్ట్రంపై దాడి చేస్తున్నారని, అవమానకర రీతిలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు చేశారు. అవినీతి కేసుల భయంతో ఉన్న వైసీపీ, బీజేపీకి పూర్తిగా సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చిందని, ఎక్కడికక్కడ లాలూచీ పడుతున్నారని విమర్శించారు. మొన్నటి వరకు సహకరించిన జనసేన పార్టీ కూడా ఇప్పుడు తమపై పడిందని, ఎవరెన్ని మాట్లాడినా భయపడే సమస్యే లేదని, ఎన్ని శక్తులు అడ్డొచ్చినా సరే, ముందుకుపోతాం తప్ప వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు.  
Chandrababu
budaga jangalu

More Telugu News