kcr: కేసీఆర్ ‘మెట్రో’ స్కామ్ పై కోర్టును ఆశ్రయిస్తా: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • ‘మెట్రో’ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ దోచుకుంటున్నారు
  • ఎల్ అండ్ టీ సంస్థతో బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారు 
  • ఆ వివరాలను రేపు బయటపెడతా  
రాయదుర్గం ‘మెట్రో’ విషయంలో తాను చేస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మెట్రో’ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ దోపిడీ చేస్తున్న విషయం ముమ్మాటికీ వాస్తవమని అన్నారు. ఈ స్కామ్ పై కోర్టును ఆశ్రయిస్తామని, ఎల్ అండ్ టీ సంస్థతో కేసీఆర్ బలవంతంగా రాయించుకున్న ఆస్తుల వివరాలను రేపు బయటపెడతానంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
kcr
Revanth Reddy

More Telugu News