Nani: చిన్న పిల్లలు చూస్తున్నారు.. టీవీల్లో అటువంటి చర్చలు వద్దు.. ఇక ఆపండి!: నాని

  • టీవీ ఛానెల్స్, వాటి హోస్ట్‌లు, కొన్ని యూ ట్యూబ్ ఛానెళ్లపై నాని ఆగ్రహం
  • సినీ పరిశ్రమను విమర్శించడంపైనే దృష్టి పెడుతున్నాయని ట్వీట్
  • భవిష్యత్ నిర్మాణంలో మీడియా పాత్ర చాలా కీలకం
సినీ పరిశ్రమపై టీవీ చానెళ్లలో నిర్వహిస్తోన్న అనవసర చర్చలను ఖండిస్తూ నేచురల్ స్టార్ నాని ట్వీట్ చేశాడు. టీవీ ఛానెల్స్ , వాటి హోస్ట్‌లు, కొన్ని యూ ట్యూబ్ ఛానెళ్లు సినీ పరిశ్రమను విమర్శించడంపైనే దృష్టి పెడుతున్నాయని ఆయన అన్నారు. భవిష్యత్ నిర్మాణంలో మీడియా పాత్ర చాలా కీలకమని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ట్వీట్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లను చిన్న పిల్లలు చూస్తున్నారని, ఇక చాలు.. ఆపండి.. అని ఆయన ట్వీట్ చేశాడు. కాగా, ఇటీవల టీవీ, యూట్యూబ్ ఛానెళ్లలో సినీ తారలపై తీవ్ర ఆరోపణలు, వారిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం పట్ల తెలుగు సినీ పరిశ్రమ మండిపడుతోన్న విషయం తెలిసిందే. 
Nani
tv channels
shows

More Telugu News