Pawan Kalyan: పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించిన నారా లోకేశ్

  • మన ముఖ్యమంత్రి రోజుకు 20 గంటల పాటు కష్టపడుతున్నారు
  • ఈ విషయాన్ని కొంతమంది వ్యక్తులు పట్టించుకోవట్లేదు
  • ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ను పరిచయం చేసిన వ్యక్తిపై నిందలా?
  • వామపక్ష నేతలతో పవన్ కలిసి ఉన్న ఫొటో పోస్ట్ చేసిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ, తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శలు చేశారు. ‘మన రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకు 20 గంటల పాటు కష్టపడుతున్నారు. ఈ విషయాన్ని కొంతమంది వ్యక్తులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. నిజమైన నేరస్తులను వదిలిపెట్టి .. ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ను పరిచయం చేసిన వ్యక్తిపై నిందలు వేస్తున్నారు’ అంటూ పవన్ ను లోకేశ్ తన ట్వీట్ లో పరోక్షంగా విమర్శించారు.

కాగా, వామపక్ష నేతలు మధు, రామకృష్ణ లతో పవన్ కల్యాణ్ ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంగ్ల పత్రికలో ఇందుకు సంబంధించి వచ్చిన వార్త లింక్ ను, వామపక్ష నేతలతో పవన్ ఉన్న ఫొటోను లోకేశ్ పోస్ట్ చేయడం గమనార్హం.
Pawan Kalyan
Nara Lokesh

More Telugu News