Chandrababu: కార్యాచరణ సిద్ధం.. ఉద్యమానికి చంద్రబాబు పిలుపు.. వచ్చేనెల 2న ఢిల్లీకి ఏపీ సీఎం

  • అమరావతిలో చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న అఖిలపక్ష సంఘాల భేటీ 
  • రాష్ట్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలన్న అఖిలపక్ష సంఘాలు
  • ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా వ్యవహరించాలన్న చంద్రబాబు
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన కొనసాగుతోన్న అఖిలపక్ష సంఘాల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చేనెల 2, 3 తేదీల్లో ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల ప్రతినిధులను కలుస్తానని చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటానికి సమాయత్తం చేయాలని, రాష్ట్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని అఖిల సంఘాలు సూచించాయన్నారు. జపాన్ తరహా నిరసన తెలియజేస్తామని ఉద్యోగ సంఘాలు చెప్పాయని తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా జరిపే ఈ పోరాటంలో అందరినీ భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా వ్యవహరించాలని,  శాంతియుతంగా ఉద్యమం నడపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో దాదాపు అన్ని పార్టీలు ఏపీ పోరాటానికి మద్దతు ఇస్తున్నాయని అన్నారు.  
Chandrababu
Special Category Status
Andhra Pradesh

More Telugu News