విజయసాయిరెడ్డిపై విరుచుకుపడ్డ నారా లోకేష్
- కేసుల నుంచి బయటపడేందుకు తాపత్రయపడుతున్నారు
- ప్రధాని పక్కన ఏ2 ముద్దాయి తిరగడం మంచిది కాదు
- చంద్రబాబును విమర్శించే అర్హత విజయసాయికి లేదు
ప్రత్యేకహోదా కోసం అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేసిన పార్టీలే... ఇప్పుడు అఖిలపక్ష సమావేశానికి డుమ్మా కొట్టాయని విమర్శించారు. కేసుల్లో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయికి ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత కూడా లేదని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
మరోవైపు, చంద్రబాబును చార్లెస్ శోభరాజ్ తో విజయసాయిరెడ్డి పోల్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో, రాజ్యసభలో మోదీ కాళ్లకు విజయసాయి మొక్కారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.