Chandrababu: ఇక పోరాటానికి దశ, దిశ నిర్దేశించండి.. అందరం కలిసి ఉద్యమిద్దాం: చంద్రబాబుకు అఖిలపక్ష సంఘాల సూచన

  • చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతోన్న అఖిలపక్ష సంఘాల సమావేశం
  • విభజన చట్టంలోని అంశాల అమలుకు ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనన్న చంద్రబాబు
  • ప్రభుత్వం చేయనున్న పోరాటానికి మద్దతిస్తామని అఖిలపక్ష సంఘాల ఏకగ్రీవ తీర్మానం
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన కొనసాగుతోన్న అఖిలపక్ష సంఘాల సమావేశంలో పాల్గొన్న నేతలందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. విభజన చట్టంలోని అంశాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు తాము ఎలాంటి పోరాటానికైనా సిద్ధమేనని చంద్రబాబు నాయుడు చెప్పారు.

దీంతో ఏపీ ప్రభుత్వం ఇకపై చేయనున్న పోరాటానికి తాము కూడా మద్దతిస్తామని అఖిలపక్ష సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. పోరాటానికి దశ, దిశ నిర్దేశించాలని, అందరం కలిసి ఉద్యమిద్దామని చంద్రబాబుకు అఖిలపక్ష సంఘాల నేతలు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 
Chandrababu
Special Category Status
Andhra Pradesh

More Telugu News