Andhra Pradesh: ఏది ముఖ్యమో రాజకీయ పార్టీలు తేల్చుకోవాలి? : ఏపీ ఏన్జీవో నేత అశోక్ బాబు

  • రాజకీయాలు కావాలో లేక రాష్ట్రం ముఖ్యమో తేల్చుకోండి
  • రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే పోరాడేందుకు ఉద్యగులు సిద్ధం
  • అఖిల పక్ష సమావేశానికి హాజరు కానీ పార్టీలను మళ్లీ ఆహ్వానించాలి : అశోక్ బాబు
రాజకీయాలు కావాలా? లేక రాష్ట్రం ముఖ్యమా? అనే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు తేల్చుకోవాలని ఏపీ ఎన్జీవో నేత అశోక్ బాబు సూచించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి న్యాయం చేయాలని రాజకీయ పార్టీలన్నీ ఏకమైతే ఉద్యోగులందరమూ పోరాడేందుకు సిద్ధమని, సీఎం చంద్రబాబు నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరు కాని పార్టీలను మళ్లీ ఆహ్వానించాలని అశోక్ బాబు సూచించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ నేతలు గిడుగు రుద్రరాజు, గౌతమ్ మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్లుగా తమ పార్టీ పోరాడుతోందని అన్నారు. విభజన చట్టంలోని హామీల అమలుకు ఎలాంటి పోరాటానికైనా తమ పార్టీ మద్దతు ఇస్తుందని అన్నారు. 
Andhra Pradesh
ngo leader ashok babu

More Telugu News