Vijay Sai Reddy: రాజ్యసభలో ప్రధాని కాళ్లకు మొక్కిన విజయసాయిరెడ్డి.. ఆశీర్వదించిన ప్రధాని!

  • రాజ్యసభలో ఊహించని ఘటన
  • ప్రధాని కాళ్లకు నమస్కరించిన విజయసాయిరెడ్డి
  • హాట్ టాపిక్ గా మారిన సంఘటన 
ప్రధాని కార్యాలయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చక్కర్లు కొడుతున్నారంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కేసులను కొట్టేయించుకోవడానికే ప్రధాని కార్యాలయం చుట్టూ విజయసాయి తిరుగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు రాజ్యసభలో ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది.

రాజ్యసభకు ఈరోజు ప్రధాని మోదీ కూడా విచ్చేశారు. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పక్కన ఆయన ఆసీనులయ్యారు. అయితే, సభలో అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేపట్టడంతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.

సభ వాయిదా పడినప్పటికీ... ఎవరూ కూడా సభ నుంచి బయటకు వెళ్లలేదు. ఎవరి సీట్లలో వారు అలాగే కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వద్దకు వెళ్లిన విజయసాయి ఆయనకు నమస్కరించారు. మోదీ కూడా ప్రతినమస్కారం చేశారు. అనంతరం కాలుమీదకాలేసుకుని కూర్చున్న మోదీ కాళ్లకు విజయసాయి నమస్కారం చేసినట్టు కథనాలు వస్తున్నాయి. కాళ్లకు మొక్కిన విజయసాయి భుజం మీద మోదీ చేయివేసి ఆశీర్వదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
Vijay Sai Reddy
Narendra Modi
Rajya Sabha

More Telugu News