allu arjun: 'రచ్చ' దర్శకుడి వైపు మొగ్గుచూపుతోన్న అల్లు అర్జున్!

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' చేస్తున్నాడు. మే 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో చేయవచ్చనే ఆసక్తి అభిమానుల్లో వుంది. సుకుమార్ తో ఉండవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

 తాజాగా సంపత్ నంది పేరు తెరపైకి వచ్చింది. గతంలో 'రచ్చ' సినిమాతో చరణ్ ఫాన్స్ ను ఆకట్టుకున్న సంపత్ నంది, ఆ తరువాత 'బెంగాల్ టైగర్'తోను తన మార్క్ చూపించాడు. ఇక రీసెంట్ గా మాత్రం 'గౌతమ్ నంద'తో ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఇటీవల ఆయన ఒక కథ వినిపించడంతో, బాగుందంటూ అల్లు అర్జున్ ఆ వైపు మొగ్గుచూపుతున్నాడట. ఈ సినిమాకి నిర్మాతగా సి.కల్యాణ్ వ్యవహరించనున్నాడని చెబుతున్నారు. మరి ముందుగా బన్నీ.. సుకుమార్ తో సెట్స్ పైకి వెళతాడా? లేదంటే సంపత్ నందికి ఛాన్స్ ఇస్తాడా? అనేది చూడాలి.        
Go Back to Shorts
allu arjun
sampath nandi

More Telugu News