laloo prasad yadav: చుట్టూ నర్సులతో లాలూ ప్రసాద్.. వైరల్ అవుతున్న ఫొటో

  • దాణా కుంభకోణం కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న లాలూ
  • కిడ్నీ సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆర్జేడీ అధినేత
  • కేసులున్నా... జనాల్లో తగ్గని క్రేజ్
దాణా కుంభకోణం కేసుల్లో జైలు శిక్షను అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అస్వస్థతతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీల్లో రాళ్లున్న కారణంగా రాంచీలోని రిమ్స్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. జైలు శిక్షను అనుభవిస్తున్నప్పటికీ జనాల్లో లాలూకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

హాస్పిటల్ లోని నర్సులు లాలూను చుట్టుముట్టి ఫొటో దిగడమే దీనికి ఒక ఉదాహరణ. ఈ ఫొటోలో లాలూ ఏమాత్రం టెన్షన్ లేకుండా, చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉమ్మడి బీహార్ రాష్ట్రానికి ఆయన రెండు సార్లు సీఎంగా వ్యవహరించారు. అంతేకాదు, జాతీయ రాజకీయాల్లో సైతం తనదైన శైలిలో చక్రం తిప్పారు. దీంతో, ఆయనకు ఇప్పటికీ జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.
laloo prasad yadav
rjd
hospital
nurses

More Telugu News