Telugudesam: తెలుగుదేశం ఆహ్వానాన్ని మన్నించిన ఒకే ఒక పార్టీ కాంగ్రెస్!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకువచ్చేందుకు తదుపరి చేయాల్సిన కార్యాచరణపై టీడీపీ సర్కారు నేడు అఖిలపక్షం, అఖిల సంఘాల సమావేశాన్ని నిర్వహిస్తూ, అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించగా, కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే దీనికి హాజరు కావాలని నిర్ణయించింది.

 ప్రధాన విపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు, నిన్నమొన్నటి వరకూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, ఇప్పుడు విడిపోయిన బీజేపీ, కొత్తగా మొదలైన జనసేన, ఆ పార్టీతో జట్టుకట్టిన వామపక్షాలు చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కారాదని నిర్ణయించాయి. ఈ మేరకు ఇప్పటికే ఈ పార్టీలన్నీ తమ తమ అభిప్రాయాలను ప్రకటనల రూపంలో మీడియాకు అందించాయి. తెలుగుదేశం ఆహ్వానాన్ని మన్నించిన ఒకే ఒక్క పార్టీగా కాంగ్రెస్ నిలవడం గమనార్హం. మరికాసేపట్లో ఈ సమావేశం జరుగనుంది.
Go Back to Shorts
Telugudesam
Congress
YSRCP
Jana Sena

More Telugu News