Cricket: ఆసీస్ ఆటగాళ్లని ఓ కంట కనిపెట్టమని కెమెరా మెన్ కు చెప్పాను... బుక్కైపోయారు!: సఫారీ మాజీ క్రికెటర్

  • విజయం కోసం ఆసీస్ జట్టు ఏదో ఒక ఎత్తుగడ వేస్తుందని ముందే ఊహించాను
  • వారిపై ఓ కన్నేసి ఉంచాలని కెమెరామెన్ కు చెప్పాను
  • గంటన్నర్ తరువాత వారు కెమెరా కంటికి చిక్కి బుక్కయ్యారు
విజయం కోసం ఆసీస్ జట్టు ఏదో ఒక ఎత్తుగడ వేస్తుందని, వారిపై ఓ కన్నేసి ఉంచాలని కెమెరామెన్ ను అప్రమత్తం చేశానని సౌతాఫ్రికా జట్టు మాజీ క్రికెటర్ ఫెనీ డివిలియర్స్ తెలిపాడు. బాల్ ట్యాంపరింగ్ వివాదంపై ఫెనీ మాట్లాడుతూ, మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఆసీస్ భావిస్తుందని, దీని కోసం అడ్డదారులు తొక్కుతుందని, మొదటి సెషన్ లో 27, 28, 29 ఓవర్లలో బంతి తమకు అనుకూలంగా పడకపోతే వారు బంతి ఆకారాన్ని మారుస్తారని ఊహించానని ఆయన అన్నాడు.

దీనినే తాను కెమెరా మెన్ కు చెప్పానని, జాగ్రత్తగా గమనించాలని సూచించానని చెప్పాడు. తానూహించినట్టే గంటన్నర తరువాత బంతి ఆకారం మార్చుతూ ఆసీస్ క్రికెటర్లు కెమెరా కంటికి చిక్కారని ఫెనీ డివిలియర్స్ వెల్లడించాడు.
Cricket
ball tamparing
south africa
Australia
feni devillers

More Telugu News